Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొరియన్ యువతులే టార్గెట్... ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తికి 40 ఏళ్ల జైలు శిక్ష

Indian man sentenced 40 years in Australia
Advertisement
  • ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తి లైంగిక దాడుల పర్వం
  • ఉద్యోగాల పేరిట కొరియా అమ్మాయిలకు వల
  • వారికి మత్తుమందు ఇచ్చి అత్యాచారాలు
  • వీడియో తీసి బెదిరింపులు
  • 2018లో నిందితుడి అరెస్ట్
  • తాజాగా శిక్షను విధించిన న్యాయస్థానం
Advertisement
ఆస్ట్రేలియాలో కీచకావతారం ఎత్తిన ఓ భారత సంతతి వ్యక్తికి అక్కడి కోర్టు 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఉద్యోగాల పేరుతో కొరియా యువతులపై అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలాడు. 

అతడి పేరు బాలేష్ ధంఖర్. నకిలీ ఉద్యోగ ప్రకటనలు ఇవ్వడం... దరఖాస్తు చేసుకున్న వారిలో కొరియన్ యువతులను గుర్తించి వారిని ఇంటర్వ్యూలకు పిలవడం... వారికి మత్తుమందు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడడం.... ఇదీ బాలేష్ సాగించిన దారుణ లైంగిక దాడుల పర్వం. 

బాలేష్ చేతిలో అత్యాచారానికి గురై యువతులంతా 21 నుంచి 27 ఏళ్ల వయసు ఉన్నవారు. తన లైంగిక దాడులను అతడు వీడియో తీసి, బెదిరింపులకు పాల్పడినట్టు గుర్తించారు. ఆస్ట్రేలియా డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి దీనిపై మాట్లాడుతూ... తనను తాను కన్సల్టెంట్ గా చెప్పుకునే బాలేష్ ధంఖర్ పక్కా ప్రణాళికతో లైంగిక దాడులకు పాల్పడ్డాడని, అత్యాచారాలకు గురైన సమయంలో యువతులు అపస్మారక స్థితిలో, కదల్లేని స్థితిలో ఉన్నారని వివరించారు. 

కాగా, ఓ బాధిత యువతి ఫిర్యాదుతో నిందితుడు బాలేష్ ధంఖర్ ను ఆస్ట్రేలియా పోలీసులు 2018లో అరెస్ట్ చేశారు. 2023లో అతడిని న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. 

బాలేష్ ధంఖర్ ఆస్ట్రేలియాలోని భారతీయ సమాజంలో ఓ గౌరవనీయ వ్యక్తిగా చలామణీ అవుతూనే ఇన్ని ఘోరాలకు పాల్పడ్డాడు. అతడిని అరెస్ట్ చేయడంతో ఆస్ట్రేలియాలోని భారతీయులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 

నేర నిర్ధారణ జరగడంతో, తాజాగా న్యాయస్థానం అతడికి 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు, శిక్షలో 30 ఏళ్ల పాటు అతడికి ఎలాంటి పెరోల్ ఉండదని తీర్పులో స్పష్టం చేశారు. 
Advertisement
Advertisement
Balesh Dhankar
Australia
Verdict
Korean Girls
Indian Origin

More Telugu News